
బీఈడీ, బీపెడ్ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ, బీపెడ్ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్, ఆడిట్‌సెల్ డైరక్టర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఫలితాల వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని కంట్రోలర్ సంపత్‌కుమార్ సూచించారు.
14 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఈ నెల 14నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్‌లాగ్ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు 11,617 మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.