
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
● బంగారం, వెండి స్వాధీనం
బాన్సువాడ : బాన్సువాడలో జరిగిన చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. గత నెల 19న పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన చెనంగారి లక్ష్మి ఇంటికి తాళం వేసి అత్త సా యవ్వ, ఆడబిడ్డ రాణిలతో కలిసి ఇంటిపైన నిద్రించారు. బోర్లం క్యాంపు తండాకు చెందిన నేనావత్ ఈశ్వర్ తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి, నగదును ఎత్తుకెళ్లాడు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్‌లో ఈశ్వర్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించడంతో తానే దొంగతనం చేసి నట్లు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడి నుంచి 6 తులాల బంగారం, 86 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. ఈశ్వర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసులో చాకచక్యంగా పనిచేసిన కానిస్టేబుల్ అశోక్ హోంగార్డు హేమాద్రిని సీఐ అభినందించారు.