
కాకతీయ విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన
నిజామాబాద్ అర్బన్: పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు క్రితి, నితీష్, అఖిల్, కృతి, సాయి శ్రేయస్, వర్షిని, కౌశిక్ ప్రసాద్ ఎమ్మెల్యేను కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రస్థాయి ఉత్త మ మార్కులు రావడం గర్వకారణం అన్నారు. జి ల్లాలో పాఠశాల విద్యను మరింత బలోపేతం చేస్తా మని పేర్కొన్నారు. 36 ఏళ్లుగా విద్య వ్యవస్థలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కాకతీయ విద్యాసంస్థలు మరింత పేరుప్రతిష్టలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, కాకతీయ కళాశాల డైరెక్టర్ రజినీకాంత్, ప్రిన్సిపాల్ ఫరీదుద్దీన్, చంద్రశేఖర్, ఫణీంద్ర, మౌనిక, రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన క్రితి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.