ఐక్యరాజ్యసమితికి ఎన్‌డీసీసీబీ కృతజ్ఞతలు
సుభాష్‌నగర్: ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఉమ్మడి జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు సభ్యుల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఎన్‌డీసీసీబీకి పూర్వవైభవం తీసుకొచ్చే నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తున్నామని, ఇందులో పాలకవర్గం, సభ్యులు, రైతుల సహకారం మరువలేనిదన్నారు. ప్రధానంగా బ్యాంకు ఎన్‌పీఏ తగ్గించేందుకు అందరి సహకారం కావాలని కోరారు. అనంతరం ఎన్‌డీసీసీబీ ప్రత్యేకంగా పాలకవర్గసభ్యులు, అధికారులు, సిబ్బందికి తయారు చేసిన టోపీలను అందజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు, బ్యాంకు సీఈవో నాగభూషణం వందే, నాబార్డు డీడీఎం, టీజీక్యాబ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


