
ఫేక్ కాల్ చేసిన ఒకరి రిమాండ్
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈ నెల 2న రాత్రి 7.41 గంటలకు రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు డయల్ 100కు కాల్ వచ్చిందన్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బీడీ టీం, సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్‌లో అన్ని ప్రాంతాలను పరిశీలించి ఫేక్ కాల్‌గా గుర్తించామన్నారు. డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తిని రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీమంత్ గౌడ్‌గా గుర్తించి, పట్టుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలుండడంతో ప్రజలను భయాందోళనకు గురిచేసి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో కాల్ చేశానని విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
వామ్మో.. ఎంత పెద్ద పాము
రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామ శివారులో ఉపాఽ ది పనులు చేస్తున్న ప్రదేశంలో సోమవారం తాటి జెర్రి పాము ప్రత్యక్షమైంది. పామును చూ సిన ఉపాధి కూలీలు భయాందోళనకు గురయ్యారు. హన్మ య్య అనే వ్యక్తి చాకచాక్యంగా పామును చంపివేయడంతో అంతా ఊపీరిపీల్చుకున్నారు. పాము పొడవు పది ఫీట్ల వరకు ఉంటుందని ఉపాధి కూలి సాయన్న తెలిపారు.