
ధాన్యం తూకం.. అంతా మోసం..
బాల్కొండ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపట్టిన ధాన్యం తూకంలో మోసానికి పాల్పడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముప్కాల్ మండలం కొత్తపల్లిలో వేంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తూ తూకం వే స్తున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో ఒక్కో బస్తా 41.5 కేజీలకు తూకం వేయాలి. ఇందులో 500 గ్రాములు బస్తా బరువు, ఒక కిలో కడ్తాగా పేర్కొంటూ అధికారులు నిబంధనలు తయారు చేశారు. కానీ ఇక్కడ అధనంగా 600 గ్రా ములు తూకమేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర దేవుడెరుగు కా నీ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలతో రైతులు సతమతమవుతున్నారు. అసలే హమాలీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబ డి కాంటాలు కావడం లేదు. దీంతో తేమ శాతం త గ్గి ధాన్యం తూకంలో అనేక తేడాలు వస్తున్నాయి. దానికి తోడు ఇలా ఎక్కువ తూకం వేయడంపై అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తూకం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
41.5 కేజీలకు బదులు 42.1 కేజీల తూకం వేస్తున్న నిర్వాహకులు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ఎక్కువ తూకం వేస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో బస్తాను 42.100 కేజీలకు తూకం చేస్తున్నారు. ఎక్కువ తూకం వేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఎండకాలం కావడంతో రోజులోనే తేమ శాతం తగ్గిపోతుంది. అయిన ఎక్కువగా తూకం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో మోసాలను అరికట్టాలి.
– చందు, రైతు, కొత్తపల్లి

ధాన్యం తూకం.. అంతా మోసం..