నిజామాబాద్‌నాగారం: నగరంలో ఆదివారం జిమ్నాస్టిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జి మ్నాస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సో మేశ్వర్, ఎలక్షన్ ఆఫీసర్ గోపిరెడ్డి, రాష్ట్ర అబ్జర్వ ర్ ముస్తఫా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అ బ్జర్వర్ భూమారెడ్డి, జిల్లా యువజన క్రీడా అ థారిటీ అబ్జర్వర్ ఆర్చరీ కోచ్ మురళి పాల్గొని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జి ల్లా అధ్యక్షుడిగా ఏలేటి కిరణ్ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శిగా స్వామి కుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్, హర్దీప్, విజయ్, వేణురాజ్, జాయింట్ సెక్రెటరీ లుగా బుచ్చన్న, సురేష్ రెడ్డి, ప్రవీణ్,దేవేందర్, ఈసీ మెంబర్స్‌గా రాజేశ్వర్,మురళి, ప్రకాష్, సంధ్య, రాకేష్, రాజకుమార్, మణి తేజ, శ్రీకాంత్‌లు ఎన్నికయ్యారు.
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
ఇందల్వాయి: దొంగతనాల నివారణకు గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డిచ్‌పల్లి సీఐ మల్లేశ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి ఇందల్వాయిలో తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు పడి రూ.70వేల నగదు, 13 తులాల వెండి గొలుసులు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితులు జగ్గ జమున, నర్సింగ్ గంగాదాస్ ఫిర్యాదు మేరకు ఇందల్వాయి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఇందల్వాయి గ్రామాన్ని సందర్శించిన సీఐ, ఎస్సై లు గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ
సిరికొండ: అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ట్రాన్స్‌కో డిచ్‌పల్లి ఏడీఈ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. సిబ్బంది విధుల్లో భద్రతా నియమాలు పాటించి సంస్థను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకురావాలన్నారు. విద్యుత్ ప్రసారంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వినియోగదారులు స్వంతంగా మరమ్మతులు చేపట్టకుండా సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఇతర నియమాలపై అవగాహన కల్పించారు. సిరికొండ సెక్షన్ ఏఈ చంద్రశేఖర్, సబ్ ఇంజినీర్ గంగారాం, లైన్ ఇన్‌స్పెక్టర్‌లు బాలచంద్రం, రాములు, లైన్‌మన్ జగన్, సుభాష్, సిబ్బంది, వినియోగదారులు తది తరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక