
వీడీసీలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌నాగారం: గ్రామాల్లో వీడీసీల ఆగడాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికై నా స్పందించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయడ నరసింహులు గౌడ్ అన్నారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ గ్రామాలలో వీడీసీల కబంధ హస్తాలలో సాంఘిక బహిష్కరణలు ఈతవనం దగ్ధాలు, బెదిరింపులు ఆగకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం వెంటనే వీడీసీలను నిషేధించాలని వారి ఆగడాలను అరికట్టాలన్నారు. వీడీసీలపై బహుజన, వృత్తి, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు. తాళ్ల రాంపూర్‌లో గౌడ గీత కుటుంబాల బహిష్కరణ, ఈతవనం దగ్ధం, గౌడ మహిళకు ఆలయంలో అవమానం ఘటన అనంతరం చెంగల్ కల్దుర్కి తగ్గేల్లి తదితర మండలాల్లో వేలాది ఈత వనాలను దగ్ధం చేయడం సరికాదన్నారు. అలాగే అంకాపూర్, కోటా ఆర్మూర్ గంగాసాగర్, మాక్లూరు బోర్గాంలలో వీడీసీలు బహిష్కరణలు, బెదిరింపులకు పాల్పడుతుండటం మాత్రం ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వీడీసీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, దగ్ధమైన ఈతవనాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వీడీసీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు శ్రీరాంగౌడ్, శేఖర్ గౌడ్, కిషన్ గౌడ్, తాళ్ల శ్రీనివాసగౌడ్‌లు ఉన్నారు.