
బైరాపూర్‌లో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న లకావత్ ప్రసాద్ (33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లుగా అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, చికిత్స లు చేయించుకున్న నొప్పి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. ఆదివా రం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులకు పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే వారు అతడిని నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రసాద్ భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో వివాహిత..
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పా ల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. అ డ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మాందాపురం మంజుల (30)కు పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన బాలకిషన్‌తో 9ఏళ్ల క్రితం వివా హం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కొన్నిరోజుల నుంచి వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగగా, మంజుల చెయ్యి విరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. మంజుల తన భ ర్త, అత్తమామలతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా వా రు నువ్వు ఇక్కడికి వస్తే మేము చనిపోతాం అని చె ప్పడంతో మనస్తాపం చెందింది. దీంతో ఆమె పుట్టినింట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి కారకులైన భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఫి ర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.