
నెల రోజులుగా సెంటర్‌లోనే..
మాక్లూర్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్‌మిల్లుకు తరలించడంలో జాప్యం ఏర్పడుతోంది. ఒక్కో సెంటర్‌లో పక్షం నుంచి నెల రోజుల తరబడి బస్తాలు ఉంటున్నాయి. మాక్లూర్ మండలం అమ్రాద్ సొసైటీ పరిధిలోని అమ్రాద్ తండాలో తూకం వేసిన బస్తాలను తరలించకపోవడంతో విసుగెత్తిన గోవింద్ అనే రైతు ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనతోపాటు తండాకు చెందిన ఏ ఒక్క రైతు ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించలేదని, నెల రోజులుగా ఎండకు ఎండి తాల్చుకుపోతున్నాయని వాపోయాడు. సొసైటీ చైర్మన్ ఎనుగంటి శంకర్‌గౌడ్‌కు ఫోన్ చేస్తే లారీలు, లేబర్‌ల కొరత ఉందని సమాధానం ఇస్తున్నాడని తెలిపారు. సొసైటీ సీఈవో గంగారాం ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకుంటున్నాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. లారీల కొరతతో గ్రామాల్లోని ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని వడ్లను మిల్లుకు తరలిస్తున్నా. అమ్రాద్‌తండాలో జాప్యం జరిగింది. అక్కడి ధాన్యం కూడా మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేస్తానని సీఈవో గంగారాం వివరించారు.