
టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
కామారెడ్డి క్రైం: దేవునిపల్లి శివారులో ఉన్న దేవి విహార్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఓ కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నది. కారు రోడ్డు కిందకు చెట్ల పొదల్లోకి దూసుకుపోగా విద్యుత్ స్తంభం విరిగిపోయింది. తాడ్వాయిలో ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న శివతేజ కారు నడిపిస్తున్నారు. ప్రమాదంలో అతడికి గాయాలు కాగా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించినప్పుడు సమీపం నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
గుండారం మాజీ ఎంపీటీసీకి రిమాండ్
రాజంపేట: మండలంలోని గుండారం మాజీ ఎంపీటీసీ హజీ నాయక్‌ను శుక్రవారం రిమాండ్‌కు తరిలించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గత నెల నడిమి తండాకు చెందినన హజీనాయక్ గ్రామంలోని గొడవలను సృష్టించడం, తండాలో జరిగే గొడవలపై కేసులు పెట్టిన వారిపై దాడి చేసినందుకుగాను బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టు అనుమతి మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.