
అ‘పూర్వ’ సమ్మేళనం
మోపాల్: మోపాల్ మండలం ముదక్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2001–02 సంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, పోతన్న, అరుణ్‌కుమార్ శర్మ, సత్యనారాయణ, శోభ, పూర్వ విద్యార్థులు జగదీశ్‌రెడ్డి, వినోద్, మల్లయ్య, నరేశ్, డాక్టర్ భాస్కర్, రాంచందర్, అంజమ్మ, స్వప్న, హంసలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
శ్రీనగర్‌లో..
రుద్రూర్: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ 1999–2000కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు శుక్రవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. చిన్న నాటి మిత్రులు అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు.

అ‘పూర్వ’ సమ్మేళనం