
భారత్ సమ్మిట్ విజయంలో సుధాకర్ పాత్ర కీలకం
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భారత్ సమ్మిట్ విజయవంతంలో జిల్లాకు చెందిన యువకుడు ప్రధాన పాత్ర పోషించాడు. ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమ్మిట్‌లో పెట్టుబడులే లక్ష్యంగా సెమినార్‌లు నిర్వహించారు. వీటిని జిల్లాకు చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకె చాప్టర్ ఉపాధ్యక్షుడు రంగుల సుధాకర్ గౌడ్ కీలకంగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచస్థాయి నాయకులకు పవర్‌ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా సుధాకర్ గౌడ్ వివరించారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ ఎంతో సురక్షితమని, తెలంగాణ పెట్టుబడుల ఖజానా అని వివరించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల ప్రతిరోజు షెడ్యూల్‌తోపాటు పలు అంశాలను విదేశీయులకు వివరించారు. సుధాకర్‌గౌడ్‌ను రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలు ప్రశంసించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన యూకే పర్యటన సైతం పర్యవేక్షించారు. సుధాకర్‌గౌడ్ సామర్థ్యాన్ని తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు భారత్ సమ్మిట్ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. సమ్మిట్ విజయవంతం కావడంతో సుధాకర్‌గౌడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అభినందించారు.
విదేశీయులకు పెట్టుబడులపై
వివరించిన యువకుడు
సీఎం యూకే టూర్‌లో
స్వయంగా పర్యవేక్షణ

భారత్ సమ్మిట్ విజయంలో సుధాకర్ పాత్ర కీలకం