
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకం
తెయూ(డిచ్‌పల్లి): గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి పేర్కొన్నారు. తె యూ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సె మిస్టర్ చదువుతున్న సింగని సాయివర్ధన్, కాను గుల విశ్వేశ్వరి సమ్మర్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఇద్దరు విద్యార్థులను రిజిస్ట్రార్ ప్రత్యేకంగా అభినందించారు. సాయివర్ధ న్ బెంగుళూరులోని ఇస్రో అనుసంధాన ఆస్ట్రోఫిజి క్స్ లేబొరేటరీలో అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనకు ఎంపిక కావడం వర్సిటీకి గర్వకారణమన్నారు. విశ్వేశ్వరి హెచ్‌సీయూలో ప్రాసెస్ కెమిస్ట్రీలో పరిశోధనకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. విద్యా ర్థులను ప్రోత్సహిస్తున్న ఫార్మాస్యూటికల్ విభాగ అధ్యాపకులను రిజిస్ట్రార్ అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, పీఆర్‌వో పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.