
దాహార్తి తీర్చే చలివేంద్రాలు
వినాయక్‌నగర్‌లో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రం
● నిబద్ధతతో నిర్వహణ ● ఏళ్ల తరబడి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సంఘాలు
వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు ప్రస్తుతంతో పోలిస్తే గతంలో ఎక్కువగా ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో రానురాను వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే కొన్ని సంఘాలు, సంస్థలు మాత్రం నిజామాబాద్ నగరంలో ఏళ్లతరబడి క్రమం తప్పకుండా చలివేంద్రాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్ని సంస్థలు 30 ఏళ్లుగా, మరికొన్ని సంఘాలు గత పదేళ్ల నుంచి వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఏదో ఏర్పాటు చేశామన్నట్లుగా కాకుండా వీటి నిర్వహణ, పరిశుభ్రత పాటించే విషయంలోనూ పక్కాగా వ్యవహరిస్తూ పూర్తి నిబద్ధత పాటిస్తున్నారు. నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిర్వహిస్తున్న చలివేంద్రాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి దాహార్తిని తీరుస్తున్నాయి. వచ్చే ఏడాది చలివేంద్రాల సంఖ్య మరింతగా పెంచనున్నట్లు శివాజీ సేవాసమితి అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు తెలిపారు. అలాగే నగరంలో మార్వాడి యువమంచ్, రాజస్తానీ బ్రాహ్మణ సమాజ్, టీఎన్జీవోస్ తదితర సంఘాలు క్రమం తప్పకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. సనాతన ధర్మ నిజామాబాద్ ఆధ్వర్యంలో నీళ్లతో పాటు మజ్జిగను సైతం అందిస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్

దాహార్తి తీర్చే చలివేంద్రాలు

దాహార్తి తీర్చే చలివేంద్రాలు

దాహార్తి తీర్చే చలివేంద్రాలు

దాహార్తి తీర్చే చలివేంద్రాలు