ప్రణాళికతో చదివా.. | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో చదివా..

May 2 2025 1:21 AM | Updated on May 2 2025 1:21 AM

ప్రణా

ప్రణాళికతో చదివా..

రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించా..

నిజామాబాద్‌ అర్బన్‌ : ‘పదో తరగతి ప్రారంభంలోనే ఉత్తమ మార్కులు సాధించాలని నిర్ణయించుకున్నా. పాఠశాలలో టీచర్లు బోధించిన పాఠాలను ఎప్పటికప్పుడు చదివా. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సాధించా’ అని చెబుతోందీ రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థిని క్రితి. కాకతీయ ఒలంపియాడ్‌ పాఠశాలలో చదివిన ఆమె.. 596/600 రాష్ట్రస్థాయి మార్కులతో జిల్లా పేరును నిలబెట్టింది. ఆమె.. తన సక్సెస్‌ మంత్రాన్ని ‘సాక్షి’తో పంచుకుంది.

తల్లిదండ్రుల స్ఫూర్తిగా..

భవిష్యత్తులో మంచి డాక్టర్‌ను కావాలన్నది నా కల. ప్రస్తుతం మా నాన్న డాక్టర్‌ కృష్ణ (ఈఎన్‌టీ), తల్లి సృజన డెంటల్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారు. వీరి అడుగుజాడల్లోనే డాక్టర్‌ కావాలనుకున్నాను. వైద్యసేవలు అందించడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చదివి డాక్టర్‌నవుతా.

మెరుగైన విద్యాబోధన

కాకతీయ ఒలంపియాడ్‌ పా ఠశాలలో విద్యార్థులకు ప్రత్యే క విద్యాబోధన అమలు చేస్తున్నాం. విద్యార్థుల మేథస్సు కు అనుగుణంగా చదివించాం. ఐఐటీ, నీట్‌, పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల స్థాయిలోనే వారికి మెరుగైన విద్యను బోధిస్తున్నాం. ప్రత్యేక విద్యాబోధనతోనే క్రితి రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కు లు సాధించింది. మా పాఠశాల నుంచి 580 కి పైబడి మార్కులు సాధించినవారు 30 మంది ఉండడం ఎంతో గర్వకారణం. – తేజస్విని,

డైరెక్టర్‌, కాకతీయ ఒలంపియాడ్‌ పాఠశాల

వెన్నుతట్టి ప్రోత్సహించారు

నా చదువు విషయంలో తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. ఎలా చదవాలి, ఒత్తిడి లేకుండా ఉండడం, సులభంగా అర్థమయ్యేలా పద్ధతులను వివరించారు. ప్రతి సబ్జెక్టుపై మొదట భయాన్ని తొలగించాలని తల్లిదండ్రులు చెప్పడంతో తేలికగా చదివాను. తక్కువ మార్కులు వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించారు. శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులు సాధిస్తావని మోటివేట్‌ చేశారు.

‘రివిజన్‌ చేశా.. నోట్స్‌ రాసుకున్నా’

రోజూ పాఠశాలకు వెళ్లగానే ఆరు సబ్జెక్టులకు సంబంధించి టీచర్లు పాఠాలు బోధించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయా సబ్జెక్టులను రివిజన్‌ చేస్తూ, ప్రతి అంశంపై నోట్స్‌ రూపొందించుకున్నాను. మరుసటి రోజు పాఠశాలలో నిర్వహించే పరీక్షలను సులభంగా రాసేదానిని. టీచర్లు బోధించిన అంశాన్ని పరిశీలన చేసుకోవడం, చదవడం అలవాటుగా మార్చుకున్నాను. దీంతో ప్రతి సబ్జెక్టుపై పట్టు పెరిగింది. కొన్నిసార్లు సమ్మెటీవ్‌ పరీక్షల్లో అనుకోకుండా మార్కులు తగ్గేవి. అయినా ఒత్తిడికి లోనుకాకుండా రోజువారీ చదువును కొనసాగించాను. వార్షిక పరీక్షల్లో 590 మార్కులు సాధిస్తానని అనుకున్నా, కానీ 596 వచ్చాయి. అనుకున్న వాటికంటే ఎక్కువ మార్కులు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

భవిష్యత్తులో మంచి డాక్టర్‌ నవుతా..

పదో తరగతి స్టేట్‌ టాపర్‌ క్రితి

ప్రణాళికతో చదివా..1
1/2

ప్రణాళికతో చదివా..

ప్రణాళికతో చదివా..2
2/2

ప్రణాళికతో చదివా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement