నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక

May 2 2025 1:21 AM | Updated on May 2 2025 1:21 AM

నేడు

నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక

సుభాష్‌నగర్‌ : నగరంలోని డీ–4 సెక్షన్‌ కా ర్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌)–2ను ఏర్పా టు చేసినట్లు డీఈ శ్రీనివాస్‌రావు, ఏడీఈ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బో ర్గాం(పీ), వినాయక్‌నగర్‌, నాగారం సెక్షన్ల కు చెందిన వినియోగదారులు విద్యుత్‌ స మస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా బిల్లింగ్‌, లైన్ల మరమ్మ తులు, ఇతరత్రా విద్యుత్‌ సమస్యలపై సీజీఆర్‌ఎఫ్‌–2లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజీఆర్‌ఎఫ్‌–2 చైర్మన్‌ ఎరుకల నారాయణ, కమిటీ సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్‌ కిషన్‌, సీజీఆర్‌ఎఫ్‌ ఫోర్త్‌ మెంబర్‌ మర్రిపల్లి రాజాగౌడ్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

10 శాతం రాయితీ

ఆర్టీసీ డీలక్స్‌ బస్సు ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌

ఖలీల్‌వాడి : నిజామా బాద్‌ నుంచి వరంగల్‌ కు డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే వారికి బేసిక్‌ టికెట్‌ చార్జీపై 10 శాతం రాయితీ ఇ స్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ డీలక్స్‌ బస్సులకు వర్తిస్తుందని, ప్రయాణికులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడానికి ఆఫర్‌ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ ఆ ఫర్‌ను ఉపయోగించుకొని టికెట్‌పై 10 శాతం తగ్గింపు చార్జీతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని ఆర్‌ఎం తెలిపారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా జడ్జి భరతలక్ష్మి

ఖలీల్‌వాడి: ప్రభుత్వం అమలు చేసే పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ జీవీఎన్‌ భరతలక్ష్మి సూచించారు. మేడే సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని కార్మికుల దరికి చేర్చాలన్నారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలన్నారు. అదనపు జిల్లా జడ్జిలు ఆశాలత, హరీష మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్మిక ప్రయోజనాల కోసం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని, అవసరమైన సహకారం అందిస్తామని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ భాస్కర్‌ రావు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిల్ల సాయారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్‌, సంస్థ పర్యవేక్షకురాలు శైలజారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక 1
1/1

నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement