జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వం జనగణన, కుల గణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పే ర్కొన్నారు. కేంద్రమంత్రివర్గ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగణన, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, మాదాసు స్వామి యాదవ్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, నాగరాజు, గంగోనె సంతోష్, పంచరెడ్డి ప్రవళిక, పల్నాటి కార్తీక్, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
సూర్యనారాయణ


