
రాహుల్‌గాంధీ సూచనతోనే కేంద్రం ప్రకటన
నిజామాబాద్ సిటీ: జనగణనతోపాటు కుల గణనను కూడా చేపడతామన్న కేంద్ర ప్రకటన అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆలోచనను కేంద్రం స్వీకరించిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశమంతా కులగణన చేపట్టాలని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులగణనను విజయవంతంగా చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. కులగణన అవసరమేలేదని మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారన్నారు. దేశమంతా కులగణన చేయడం కాంగ్రెస్ విజయమన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు జావిద్ అక్రమ్, నరాల రత్నాకర్, కెతావత్ యాదగిరి, విపుల్ గౌడ్, నరేందర్ గౌడ్, సేవాదల్ సంతోష్, సాయి కిరణ్, శివ పాల్గొన్నారు.
తెలంగాణ దేశానికే
రోల్ మోడల్‌గా నిలిచింది
దేశమంతా కులగణన అభినందనీయం
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి