
నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గ్రామాల్లోని నర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎండవేడిమి దృష్ట్యా మొక్కలకు ప్రతిరోజూ నీరు పట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్‌రావు ఆదేశించారు. మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి గ్రామపంచాయతీలో గురువారం ఆయన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నర్సరీ, వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని, ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలన్నారు. పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, తప్పుడు వివరాలు నమోదు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్‌కుమార్, కార్యదర్శులు సురేశ్, వెంకటేశ్, మృదుల, పద్మజ, కారోబార్ శ్రీనివాస్ ఉన్నారు.
ప్రతిరోజూ చెత్త సేకరణ చేపట్టాలి
జిల్లా పంచాయతీ అధికారి
శ్రీనివాస్‌రావు