
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు పెద్ద తండాకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. వివరాలు ఇలా..తండాకు చెందిన అర్చన(19) అనే ఇంటర్ విద్యార్థిని మంగళవారం సోదరుడు అరవింద్‌తో కలిసి ఈఏపీసెట్ పరీక్ష రాశారు. బుధవారం ఉదయం అరవింద్, అర్చన ఇద్దరు కలిసి బైక్‌పై హైదరాబాద్ నుంచి స్వగ్రామం నల్లమడుగు పెద్ద తండాకు బయలుదేరారు. మేడ్చల్ రింగ్ రోడ్డు సమీపంలో వీరి బైక్‌ను ఓ లారీ వెనుక నుంచి వచ్చిన ఢీకొట్టింది. ఈ ఘటనలో అర్చన అక్కడికక్కడే మృతి చెందగా, అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రైలు ఢీకొని వృద్ధురాలు..
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయరెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా.. డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామానికి చెందిన రాయ సాయవ్వ (65) బుధవారం ఉదయం డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా అప్పుడే వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ చందన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
దాబా పైనుంచి పడి యువకుడు..
డిచ్‌పల్లి: మండలంలోని డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు దాబా పైనుంచి కింద పడి మృతిచెందాడు. ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరా లు ఇలా.. డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివసించే షేక్ అజహర్ (29) పెయింటర్‌గా పని చేస్తూ, మద్యానికి బానిసగా మారాడు. దీంతో అతడి భా ర్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉ న్న అజహర్ తమ ఇంటి దాబా పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు జి ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి త ల్లి తస్లీమ్‌బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వ్యాన్ కింద పడి బాలుడు..
సిరికొండ: మండలంలోని ము షీర్‌నగర్ గ్రామంలో డీజే బా క్సుల వ్యాను కింద పడి ఓ బా లుడు మృతి చెందినట్లు ఎస్సై రామ్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన మాలావత్ బాలు కుమారుడు జగదీష్(13), గణేష్ అనే వ్యక్తి తో కలిసి వ్యానులో మంగళవారం రాత్రి డీజే బా క్సులు తీసుకురావడానికి వెళ్లాడు. గణేష్ వాహనా న్ని అజాగ్రత్తగా నడపడంతో వ్యాను వెనుక బాక్సులపైన కూర్చున్న జగదీష్ కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో జగదీష్ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి