
చోరీకి పాల్పడ్డ మహిళ రిమాండ్
సిరికొండ: మండల కేంద్రంలో ఇటీవల చోరీకి పాల్పడ్డ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై రామ్ బుధవారం తెలిపారు. సిరికొండలో కిరాయికి ఉంటున్న తిరుపతి ఏప్రిల్ 28న ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లాడు. తిరిగివచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో, బంగారం, నగదు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధర్పల్లి సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో విచారణ చేసి చోరీకి పాల్పడ్డ మహిళను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితురాలిపై సుమారు ఇప్పటికే 16 కేసులు ఉన్నాయని ఎస్సై తెలిపారు.
షార్ట్‌సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌తో కిరాణం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. గ్రా మానికి చెందిన గంజి రాజు కిరాణం దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిరాణ సామగ్రి తగలబడటంతోపాటు నగదు పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. స్థానికులు గమనించి బిందెలతో నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో దుకాణం పూర్తిగా కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది.