
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం
జక్రాన్‌పల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం జక్రాన్‌పల్లి మండలం జక్రాన్‌పల్లి, కొలిప్యాక్, తొర్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొలిప్యాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేస్తామన్నారు. దేశంలోనే పేద ప్రజలకు సన్న బియ్యం అందజేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. రాజీవ్ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం స్థాపన కోసం తమ విలువైన పట్టా భూములను ఇవ్వబోమని వివిధ గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, కొలిప్యాక్ సొసైటీ మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మద్దుల రమేశ్, ఆర్మూర్ గంగారెడ్డి, నర్సారెడ్డి, చిన్న సాయి రెడ్డి, గడ్డం గంగారెడ్డి, కాటిపల్లి నర్సారెడ్డి, నిట్ శేఖర్, శ్రీనివాస్ గౌడ్, కనక రవి, మాదరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి