
ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయాలి
డిచ్‌పల్లి: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గావ్‌లో పర్యాటకులపై పాశవికంగా దాడులు జరిపి 28 మందిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదులను ఎక్కడున్నా కనిపెట్టి ఎన్‌కౌంటర్ చేయాలని ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి రైల్వేస్టేషన్ మీదుగా మార్కెట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రదాడిలో మరణించి అమరులకు నివాళులర్పించారు. అనంతరం బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను కాల్చి చంపడం దారుణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభు త్వం నిఘా చర్యలను పటిష్టం చేయాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, శక్కరికొండ కృష్ణ, నీరడి పద్మారావు, యూసుఫ్, కుంచాల రాజు పాల్గొన్నారు.