జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ

Apr 16 2025 11:06 AM | Updated on Apr 16 2025 11:06 AM

జిల్ల

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లా జడ్జి సునీ తా కుంచాల పెద్దపలి జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఆమె స్థా నంలో హైదరాబాద్‌ నుంచి జీవీఎన్‌ భరతలక్ష్మీ రానున్నారు. అలాగే బోధన్‌ అదనపు జిల్లా జడ్జి రవికుమార్‌ గద్వాలకు బదిలీ అయ్యారు.

నేడు ఇన్‌చార్జి మంత్రి పర్యటన

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు జిల్లా కలెక్టరేట్‌ లో నిర్వహించే సమీక్షాసమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, సన్నబియ్యం లబ్దిదారుని ఇంటిలో భోజనం చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు భీమ్‌గల్‌ మున్సి పాలిటీ పరిధిలో, అనంతరం మోర్తాడ్‌ మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో జూపల్లి పాల్గొని తిరిగి హైదరాబాద్‌ బయల్దేరుతారు.

ఆలయ హుండీ లెక్కింపు

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని సారంగాపూర్‌ హనుమాన్‌ ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. మొత్తం రూ.60,476 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు తెలిపారు. ఎండోమెంట్‌ పరిశీలకులు కమల, ఎన్‌.రాములు, శశికుమార్‌రాందాసి, ప్రశాంత్‌కుమార్‌, పారాయణ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం బోనస్‌

దారి మళ్లింపుపై విచారణ

రుద్రూర్‌: కోటగిరి సింగిల్‌ విండో పరిధిలో సన్నధాన్యం బోనస్‌ డబ్బులు అనర్హుల ఖాతాలో జమ చేశారనే ఫిర్యాదుపై సహకార అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సహకార అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అంబర్‌సింగ్‌ రాథోడ్‌, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ అలీం కోటగిరి విండోకు వచ్చి విచారణ చేపట్టి, వారం క్రితం నోటీసులు అందుకున్న వారి వివరాలు సేకరించారు. బుధవారం కూడా విచారణ కొనసాగుతుందని, అవసరమైతే రైతుల వద్ద కూడా సమాచారాన్ని సేకరిస్తామని అధికారులు వెల్లడించారు.

నేత్ర వైద్యశాలలకు నోటీసులు

నిజామాబాద్‌నాగారం: వైద్యుడు లేకున్నప్పటికీ కాంపౌండర్‌ కంటి పరీక్షలు చేయడం, మందుల రాయడంపై జిల్లా వైద్యారోగశా ఖాధికారులకు ఫిర్యాదు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన డీఎంహెచ్‌వో రా జశ్రీ ఆదేశాల మేరకు విచారణ అధికారులు డాక్టర్‌ సుప్రియ, వేణు తదితరులు నగరంలోని ఖలీల్‌వాడీలో ఉన్న డాక్టర్‌ కృష్ణమూర్తి శ్రీరామా నేత్ర వైద్యశాల, గిరిజా ఆస్పత్రిని తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది తప్పును అంగీకరించినట్లు సమాచారం. విచారణ నివేదికను డీఎంహెచ్‌వోకు ఈ నెల 11వ తేదీన అందడంతో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులకు జవా బు ఇవ్వాలని ఆదేశించారు.

రేషన్‌లో ప్లాస్టిక్‌ బియ్యం అవాస్తవం

సుభాష్‌నగర్‌: రేషన్‌ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నా యంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జి ల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖ ని పెద్దపల్లి జిల్లాలోని తిలక్‌నగర్‌లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిశాయని ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు ప్రచారం చేశారని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సన్న బియ్యం పథకంపై ప్రజలలో ఆందోళన సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ 1
1/2

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ 2
2/2

జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement