
కారులో చెలరేగిన మంటలు
● సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
కామారెడ్డి క్రైం: ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కామారెడ్డి సమీపంలోని క్యాసంపల్లి శివారు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటు చేసుకుంది. భువనగిరి నుంచి నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్‌కు ఓ కుటుంబం స్కార్పియోలో వస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెందడాన్ని గమనించిన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి అందరినీ కిందికి దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది.