
సారంగాపూర్ గ్రామంలో మాట్లాడుతున్న బాజిరెడ్డి
నిజామాబాద్ రూరల్/మోపాల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా తనను మళ్లీ ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అబద్ధాలు, వాగ్ధానాలను నమ్మితే మోసపోయి గోస పడతామన్నారు. రూరల్ మండలంలోని రాంనగర్, సారంగాపూర్, ముబారక్ నగర్, గూపన్పల్లి ,గంగస్తాన్, మాధనగర్ గ్రామాలతో పాటు మోపాల్ మండలంలోని న్యాల్‌కల్, సిర్‌పూర్, ముదక్ పల్లి, శ్రీరాంనగర్ తండా, బోర్గం గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఐటీ కంపెనీలు కేటీఆర్ సమక్షంలో వస్తున్నాయని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి ప్రత్యేక కోర్సును తన సొంత డబ్బులతో ఇప్పించారని, ఈ అవకాశంతో దాదాపు 60 మంది పోలీసు అధికారులుగా మారారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఒక డమ్మీ క్యాండిడేట్ అని, అతడిని చూసి ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. నిన్న మొన్న వచ్చిన మాండవ వెంకటేశ్వరరావుతో ఒరిగేదేమీ లేదని ఏమీ లేదన్నారు. బాజిరెడ్డి సతీమణి వినోదమ్మ, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఒలింపిక్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, లింగం, ముత్యంరెడ్డి, శ్రీనివాస్‌రావు, ఉమాపతిరావు, శ్రీనివాస్, కన్నిరాం నరేష్, జెడ్పీటీసి సుమలత గోపాల్ రెడ్డి, ఎంపీపీ అనూష ప్రేమదాస్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, గుండారం ఎంిపీటీసీ అంకాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే,
బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
పలు గ్రామాల్లో జోరుగా
ఎన్నికల ప్రచారం

బాజిరెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు