
మీడియాతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
సుభాష్‌నగర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్థాయి కి మించి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎ న్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అక్టోబర్ 3న జిల్లా కేంద్రానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో శుక్రవా రం గిరిరాజ్ కళాశాల గ్రౌండ్‌లో సభాస్థలి వద్ద ఏ ర్పాట్లను ఈటల పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ ఇ ప్పటి వరకు తెలంగాణలో అభివృద్ధి పనుల కో సమే వచ్చారని, రాజకీయాల కోసం రాలేదన్నారు. రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున రుద్ధరించారన్నారు. ఎన్టీపీసీ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణకు వి ద్యుత్ కొరత లేకుండా చేయాలని నిర్ణయించారని, ఇందులోభాగంగా 800 మెగావాట్ల విద్యుత్‌ప్రాజె క్టును ఇందూరు నుంచి ప్రారంభించనున్నారని తెలిపారు. రెండు నెలల్లో మరో 800 మెగావాట్ల వి ద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. తొమ్మిదేళ్ల లో 3వేల కిలోమీటర్ల హైవేలను నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు. ప్రధాని మోదీని ఏం ముఖం పెట్టు కుని తెలంగాణకు వస్తున్నారనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ తన మాటలతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ లక్ష న్నరకుపైగా జనాలను కార్యకర్తలు తరలించాలన్నా రు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారీ వెంకటరమణి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లాల అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య, మోరేపల్లి సత్యనారాయణ, లోక భూపతిరెడ్డి, బద్దం లింగారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పెద్దోళ్ల గంగారెడ్డి, దినేశ్ కులాచారి, మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల వ్యాఖ్యలపై
ఈటల రాజేందర్ విమర్శ
ప్రధాన మోదీ బహిరంగసభ
ఏరాట్ల పరిశీలన
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ
సమన్వయ సమావేశానికి హాజరు