
పరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు
మాక్లూర్ : మండలంలోని గంగరమంధ గ్రామ శివారు వ్యవసాయ పొలాల్లో గురువారం ఉదయం ఓ రైతుకు చిరుత పిల్ల కనిపించడంతో గ్రామంలో భయాందోళనలు చెలరేగాయి. రైతు రాజేశ్ తన పొలంలో గడ్డి కోస్తుండగా కొద్దిదూరంలో నుంచి చిరుత పిల్ల పరిగెత్తగా గమనించి వీడియో తీసి గ్రామస్తులకు తెలియజేశారు. సర్పంచ్ వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అశోక్‌కుమార్, బీట్ అధికారి శ్రీనివాస్ గ్రామానికి చేరుకోని రైతులతో కలిసి మూడుగంటలకు పైగా అన్వేషించగా చిరుత పులి, పిల్లల ఆనవాళ్లు లభించలేదు. గండు పిల్లి కూడా దూరం నుంచి చూస్తే చిరుత మాదిరిగానే కన్పిస్తుందని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఏడాదికాలంగా చిరుత పిల్లలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొనడంలో వాస్తవం కనిపించడం లేదన్నారు. చిరుత ఉండి ఉంటే పశువులు, మేకలు, కుక్కలపై దాడి చేసేదన్నారు. ఏదేమైనప్పటకీ రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రసాద్, భూమయ్య మరి కొందరు రైతులు ఫారెస్ట్ అధికారుల వెంట ఉన్నారు.
● అన్వేషించిన ఫారెస్టు అధికారులు ● గండుపిల్లిగా అనుమానం

రైతుకు కన్పించిన చిరుత