
సుభాష్‌నగర్: ‘టీఎస్పీఎస్సీ’ పేపర్ లీకేజీ కారకులు ఎవరని ప్రశ్నించేందుకు వెళ్లిన బీజేవైఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేవైఎం పోరాటం వల్లే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు వెళుతున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపించారని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.