ఖానాపూర్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని నిర్మల్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ యు.కాశీనాథ్ సూచించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సిబ్బంది పరస్పర సామరస్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ కాశీనాథ్ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్పపత్రికి వచ్చే రోగులను జాగ్రత్తగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో సమస్యల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు.


