నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

భానుడి భగభగలతో జిల్లా అగ్నిగుండంలా మారింది. ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. దీంతోప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. భానుడి నిప్పులకు వడగాలులు ‘దెబ్బ’కొడుతున్నాయి. జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాకు హెచ్చరికలు ఉన్నాయి. వైద్యులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. – నిర్మల్‌

మామడ కేజీబీవీ ఎస్‌వోకు ప్రతిభ పురస్కారం

మామడ: మామడ కేజీబీవీ విద్యార్థులు పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. దీనికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి జ్యోతి, పదో తరగతి విద్యార్థిని యశస్విని ప్రశంసాపత్రాలతోపాటు గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.

జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డులు దాటిపోతున్నాయి. ప్రతీసీజన్‌లో మే 25–30 మధ్య నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి నెల ప్రారంభం నుంచే కొనసాగుతున్నాయి. కొన్ని మండలాల్లో మరీ దారుణంగా ప్రతిరోజూ 45 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గకుండా నమోదవుతున్నాయి. దస్తురాబాద్‌లో మంగళవారం 45.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ 46–47వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్‌(పాతఎల్లాపూర్‌)లోనూ 45.7, నిర్మల్‌రూరల్‌(అక్కాపూర్‌)లో 45.4, దిలావర్‌పూర్‌ 45.3 డిగ్రీ సెల్సియస్‌ ఉండగా, మిగితా మండలాలూ 44.5కు తగ్గకుండా మండుతుండటం గమనార్హం.

భయపెడుతున్న వడగాలులు..

మండుతున్న ఎండలకు తాజాగా వడగాలులు తోడవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. క్షణాల్లో మనిషిని నీరసపర్చి ‘వడదెబ్బ’ కొడుతున్నాయి. ఇంట్లో వేడెక్కిన పైకప్పు, ఫ్యాన్‌ గాలీ వేడిగా రావడం, సరిపడా నీరు తాగకపోవడంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు వడదెబ్బతో మృతిచెందారు. జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన లక్ష్మణ్‌, ఖానాపూర్‌ మండలం గోసంపల్లిలో మేకల కాపరి గోవిందు, భైంసా పట్టణానికి చెందిన రావుల లక్ష్మిబాయి వడదెబ్బ కారణంగా చనిపోయారు.

పనులకు పరేషాన్‌..

పొద్దున్నే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సు, ఆటోల డ్రైవర్లు ఎండల్లో, మరోవైపు వడగాలులను తట్టుకుంటూ ఇబ్బందికరంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి వెనుకాడుతున్నారు. ఎండల కారణంగా పట్టణాల్లో చల్లని పానీయాలు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలకు డిమాండ్‌ పెరిగింది. ఐస్‌క్రీం పార్లర్లు, జ్యూస్‌ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజులు ఇలాగే ఎండలు, వడగాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ‘వామ్మో.. ఇవేం ఎండలు బాబోయ్‌..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండ వేడికి తలపై చున్నీలు కప్పుకుని వెళ్తున్న యువతులు

డీఈవోకు సన్మానం

నిర్మల్‌ రూరల్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మూడో స్థానంలో నిలవడంతో జిల్లా కేంద్రంలోని పెన్షనర్‌ భవన్‌లో డీఈవో భోజన్నను పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. సంఘం ప్రతినిధి ఎంసీ.లింగ న్న మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జి ల్లా మూడో స్థానంలో నిలిచేందుకు అహర్నిశలు కృషిచేసిన భోజనను అభినందించారు. ఇందులో రిటైర్డ్‌ ఉద్యోగులు జనార్దన్‌, రమేశ్‌, బాలకిషన్‌, విలాస్‌, రాజేశ్వర్‌, రామేశ్వర్‌, రాములు, రమేశ్‌, శేషాద్రి, వేణుగోపాల్‌, పోశెట్టి, రాములు, కమలాకర్‌ పాల్గొన్నారు.

వ్యాపారుల ఇష్టారాజ్యం..!

అప్రమత్తంగా ఉండాలి..

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దు.

దాహం వేసినా వేయకున్నా తరచూ తగినంత నీరు తాగాలి.

కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. కెఫిన్‌, చక్కెర శాతం ఉన్న కూల్‌ డ్రింకులు తాగొద్దు.

తేలికపాటి దుస్తులు ధరించాలి.

వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నేడు పోలీస్‌ ప్రజావాణి

భైంసాటౌన్‌: పట్టణంలోని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల అందుబాటులో ఉంటారు. భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా కలిసి అర్జీలు అందించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement