నిర్మల్‌ఖిల్లా: సాంకేతిక నైపుణ్యాల సాధనతోనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం యువత నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పలువురు అధికారులు మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత సాంకేతికతకు తగ్గట్టుగా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో యువతకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుందో వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఎల్డీఎం రాంగోపాల్, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఐటీఐ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


