ఘనంగా వెంకన్న రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వెంకన్న రథోత్సవం

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

నిర్మల్‌ టౌన్‌: దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయ చైర్మన్‌ ఆమెడ శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని లాగారు. రథోత్సవం ధ్యాగవాడ, నగరేశ్వరవాడ, కొత్త బస్టాండ్‌, బుధవార్‌పేట్‌, గాంధీచౌక్‌, సోమవార్‌పేట్‌ మీదుగా కొనసాగింది. రథంపై తరలి వస్తున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఆలయ మాజీ చైర్మన్‌ ఆమెడ కిషన్‌, ఆలయ ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్‌, నాంపల్లి రాజేందర్‌, సుంకరి భీమేష్‌, కృష్ణవేణి దేవేందర్‌గౌడ్‌, గంగాధర్‌, అనిత జాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement