సీఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

నిర్మల్‌చైన్‌గేట్‌:రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఈనెల 6న బాసర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. సీఎం బాసర చేరుకున్న నుంచి, ఆలయానికి చేరుకుని, పూజలు నిర్వహించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, తిరిగి వెళ్లేవరకు వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. హెలీప్యాడ్‌, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేయాలన్నారు. ఆలయాన్ని పూలతో ముస్తాబు చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు, సంబంధిత ఉద్యోగులు, సిబ్బందికి, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై అంతర్గత శాఖాపరమైన ఆదేశాలు తక్షణమే జారీచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, బాసర ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు, డీపీవో శ్రీనివాస్‌, అగ్నిమాపక అధికారి ప్రభాకర్‌, డీఎంహెచ్‌వో రాజేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement