ఆర్టిజన్లకు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్లకు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

● టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజన్న

నిర్మల్‌చైన్‌గేట్‌: విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టి జన్‌ కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్‌ కార్మికుల సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట గురువారం వంటావార్పు చేపట్టారు. టీయూసీఐ సమ్మెకు తెలిపింది. కె.రాజన్న మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేస్తానన్న హామీని అమలు చేయకపోవడం వలన విద్యుత్‌ రంగంలో పనిచేస్తు న్న కాంటాక్ట్‌ కార్మికులు దాదాపు 23 వేల మంది స మ్మెబాట పట్టారన్నారు. పర్మినెంట్‌ విద్యుత్తు ఉద్యోగులకు వర్తించే సర్వీస్‌ రూల్స్‌ ఆర్టిజన్లకు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే సంఘీభావం

ఆర్టిజన్ల సమ్మెకు నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సమ్మె శిబిరంలో కూర్చుని మాట్లాడారు. విద్యుత్‌ ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులు, బీజేపీ సీనియర్‌ నాయకులు రావుల రాంనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement