● అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్
నిర్మల్‌చైన్‌గేట్: సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి మరువలేనిదని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని గురువారం నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దొరలు, భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని కీర్తించారు. చివరి శ్వాస వరకు అణగారినవర్గాలకు అండగా నిలిచారని తెలిపారు. ఇటువంటి గొప్ప యోధుల జయంతి, వర్ధంతుల ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సర్దార్ సర్వాయి పా పన్నగౌడ్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల సంఘాల నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఆర్డీవో రత్నాకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.


