వార్డు సభలతో స్థానిక సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వార్డు సభలతో స్థానిక సమస్యలు పరిష్కారం

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌/నిర్మల్‌ రూరల్‌: వార్డు సభల నిర్వహణతో వార్డుల్లో నెలకొన్న సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బుధవార్‌పేట్‌, మోచిగల్లీలో, నిర్మల్‌ మండలంలోని వెంగ్వాపేట్‌ గ్రామ పంచాయతీ భవన ఆవరణలో గురువారం వేర్వేరుగా ఏర్పాటుచేసిన వార్డు సభలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలోపు వార్డు సభలు నిర్వహించి, స్థా నికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో కొత్తగా 60 వేల రేషన్‌ కార్డులను ఇవ్వడం జరిగిందని అన్నారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశాన్ని చదివి విని పించారు. అనంతరం ఇటీవల జిల్లాకు రెండు స్కోచ్‌ అవార్డులు లభించడానికి కృషి చేసిన కలెక్టర్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ సన్మానించారు. వార్డు సభలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, డీపీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీమ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, సర్పంచ్‌ వనిత, స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

కుంటాల: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కుంటాలలో గురువారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తోందన్నారు. గ్రామ సభల్లో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి ప్రాధాన్యతపై నిర్ణయించి రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత చూపాలని పేర్కొన్నారు. అనంతరం కుంటాల అభివృద్ధిని తెలుపుతూ ఏర్పాటుచేసిన ఫొటో స్టాల్‌ను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. కల్లూరులో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దుర్గం శంకర్‌ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో సర్పంచులు జక్కుల గజేందర్‌, పెంటవార్‌ దశరథ్‌, తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, ఎంపీడీవో వనజ, ఎంపీవో రహీంఖాన్‌, ఉప సర్పంచ్‌ పరికిపండ్ల రమణ, పంచాయతీ కార్యదర్శులు రాజబాపు, భోజన్న, జీపీవో నాగేందర్‌పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement