పంతం నెగ్గింది.. పీఠం దక్కింది! | - | Sakshi
Sakshi News home page

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!

Feb 17 2026 7:23 AM | Updated on Feb 17 2026 7:23 AM

పంతం

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

భైంసా బల్దియాపై స్వతంత్ర జెండా 70 ఏళ్లలో తొలిసారి అవకాశం చైర్మన్‌గా తూమోల్ల దత్తాత్రి, వైస్‌ చైర్‌పర్సన్‌గా బీబీ కుతిజా సిద్ధిఖా ప్రమాణ స్వీకారం

నిర్మల్‌

‘పది’కి అల్పాహారం

పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి అల్పాహారం అందిస్తున్నారు.

IIIలోu

కలెక్టర్‌ను కలిసిన

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అప్పాల కావ్య, వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేశారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగం సహకారం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పట్టణ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, నిర్మల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎస్పీతో మర్యాద పూర్వకంగా..

నిర్మల్‌ టౌన్‌: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి ఎస్పీ జానకీషర్మిలను క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా తో సన్మానించారు. శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీని కోరారు. వీరివెంట కాంగ్రెస్‌ నిర్మల్‌ ఇన్‌చార్జి శ్రీహరిరావు ఉన్నారు.

భైంసాటౌన్‌: భైంసా మున్సిపాలిటీలో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. బల్దియా ఆవిర్భావం నుంచి ఐదు పర్యాయాలు కాంగ్రెస్‌(1956–92), అ టు తరువాత 2005లో(టీడీపీ) మినహా నాలుగు పర్యాయాలు ఎంఐఎం (1995–2005)(2014– 25) అధికార పీఠం కై వసం చేసుకుంటూ వస్తున్నాయి. ఈసారి సైతం అధికార పీఠంపై ఎంఐఎం కన్నేయగా, ఇద్రిజ్‌ వర్గానికి చెందిన ఇద్దరు స్వతంత్రులు వారి ఆశలకు గండి కొట్టారు. 12 స్థానా ల్లో గెలవడంతో అధికారానికి దూరమైంది. ఇక, ఆరు స్థానాల్లో బీజేపీ, ఒకచోట కాంగ్రెస్‌ గెలుపొందగా, ఏడు చోట్ల గెలిచిన స్వతంత్రులు అధికార పీఠం దక్కించుకోవడంలో కీలకంగా మారారు. ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు ఆసక్తికర పరిణామాల నడుమ ఎట్టకేలకు బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్రులు అధికారం కై వసం చేసుకున్నారు. 70 ఏళ్ల మున్సిపల్‌ చరిత్రలో తొలిసారి ఒక స్వతంత్ర అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

నెగ్గిన పంతం..

ముధోల్‌లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యే పి.రామారావుపటేల్‌ ఆది నుంచి మున్సిపల్‌ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామని చెబుతూవస్తున్నారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలోనూ ఎంఐఎంను తూర్పార పడుతూ విమర్శలకు ఎక్కుపెట్టారు. అంతేగాక, ఎంఐఎం వ్యతిరేకవర్గం నేత మీర్జా ఇద్రిజ్‌ బేగ్‌ సైతం ఈసారి 17 స్థానాల్లో స్వతంత్రులను నిలిపారు. ఇటు కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ ఇన్‌చార్జి బి.నారాయణ్‌రావు పటేల్‌ సైతం 25 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలిపారు. ఫలితంగా ఎంఐఎంను 12 స్థానాలకే పరిమితం చేశారు. అయితే, ఈసారి భిన్నంగా స్వతంత్రులు(7) అధిక స్థానాల్లో గెలవ డం, బీజేపీ(6), కాంగ్రెస్‌ (1) మద్దతుతోపాటు ఎ క్స్‌ అఫీషియోగా ఎమ్మెల్యే(1) తోడవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక లాంఛనమైంది. 23వ వా ర్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తూమోల్ల దత్తాత్రి చైర్మన్‌గా, 25వ వార్డు నుంచి గె లుపొందిన మరో స్వతంత్ర అభ్యర్థి బీబీ కుతిజా సి ద్ధిఖా వైస్‌చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

ముందుగా ప్రమాణ స్వీకారం.

ముందుగా ఎన్నికల అధికారులు కౌన్సిలర్‌ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. ఎంఐఎం నుంచి అబ్దుల్‌ ఖాదర్‌(1వార్డు) చైర్మన్‌ అభ్యర్థిగా ఆమేర్‌ అహ్మద్‌(2వార్డు) ప్రతిపాదించగా, నాజిర్‌ అహ్మద్‌(17వార్డు) బలపరిచారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా దగ్దే నమ్రత(13వార్డు) పేరును అబ్దుల్‌ మాజిద్‌(21వార్డు) ప్రతిపాదించగా, ఫైజుల్లాఖాన్‌(16వార్డు) బలపరిచారు. వీరి సంఖ్యాబలం 11 మా త్రమే ఉంది. అయితే, స్వతంత్ర అభ్యర్థి తూమోల్ల దత్తాత్రిని చైర్మన్‌ అభ్యర్థిగా నిమ్మల ప్రవీణ్‌(14వ వార్డు) ప్రతిపాదించగా, ధర్మవరం శ్రీనివాస్‌(12వ వార్డు) బలపరిచారు. వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బీబీ కుతిజా సిద్దిఖా పేరును వడ్నం శ్రీనివాస్‌(11వ వార్డు) ప్రతిపాదించగా, దగ్డే శ్రీకాంత్‌(10వ వార్డు) బలపరిచారు. వీరికి 14 మంది అభ్యర్థులు, ఎమ్మె ల్యే ఎక్స్‌ అఫీషియో ఓటుతో 15 మంది మద్దతు లభించింది. దీంతో ఎన్నిక లాంఛనమైంది. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం వద్దకు భారీగా జనం చేరుకున్నారు. స్వతంత్రులు, బీజేపీ అభిమానులతోపాటు ఇద్రిజ్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్నిక అనంతరం టపాసులు కాల్చారు. హిందూ, ముస్లిం భాయి.. భాయి అంటూ నినాదాలు చేశారు.

ఎలా జరిగిందంటే..

నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది. ముందుగా మీర్జా ఇద్రిజ్‌ బేగ్‌ తన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ నివాసానికి చేరుకోగా, అక్కడి నుంచి ఏడుగురు స్వతంత్రులు, ఆరుగురు బీజేపీ, ఒక కాంగ్రెస్‌ అభ్యర్థితో కలిసి వాహనాల్లో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు ఎంఐఎం అభ్యర్థులు 11 మంది కూడా చేరుకున్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతు కుటుంబం నుంచి చైర్మన్‌గా

మొదటిసారి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలవడంతోపాటు ఏకకాలంలో చైర్మన్‌ పీఠం కూడా దక్కించుకున్నారు తూమోల్ల దత్తాత్రి. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన తూమోల్ల ముత్తన్న, కళావతి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు సంతానం. పెద్ద కుమారుడు దత్తాత్రి స్థానిక శ్రీసరస్వతి శిశు మందిర్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్‌ లక్ష్మణచాందలో, డిగ్రీ పట్టణంలోని జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2020 నుంచి తన తండ్రి ముత్తన్న పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 11వ వార్డు నుంచి టికెట్‌ ఆశించారు. టికెట్‌ దక్కకపోవడంతో, 23వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో ఈసారి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారగా.. రాజకీయ సమీకరణాల నడుమ ఎట్టకేలకు చైర్మన్‌ పీఠం దక్కించుకున్నారు.

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!1
1/3

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!2
2/3

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!3
3/3

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement