కాంగ్రెస్‌లో జోష్..
వరుస ఓటములతో కుంగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల్లో మున్సిపల్ ఎన్నికలు జోష్ నింపాయి. నిర్మల్‌లో ఎవరి మద్దతూ అవసరం లేకుండానే 24 స్థానాలు గెలిచి బల్దియా పీఠాన్ని హస్తగతం చేసుకోవడం ఊరటనిచ్చింది. ఖానాపూర్‌లో పీఠాన్ని కై వసం చేసుకునే స్థాయిలో ఉండటం, భైంసాలో బీజేపీ, ఎంఐఎంల గట్టిపోటీ మధ్య ఒక స్థానాన్ని దక్కించుకోవడం కొంత సంతృప్తినిచ్చాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో వేర్వేరు గ్రూపులంటూ ప్రచారం సాగినా.. నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ కలిసికట్టుగా పనిచేయడం పార్టీకి కలిసివచ్చింది.


