కొలువుదీరిన నిర్మల్ పాలకవర్గం
చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్‌చైర్మన్‌గా గణేశ్‌చక్రవర్తి ఏకగ్రీవం కౌన్సిలర్లందరితో ప్రమాణస్వీకారం
నిర్మల్: నిర్మల్ మున్సిపల్ పాలకర్గం సోమవారం కొలువుదీరింది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్‌గా అప్పాల గణేశ్‌చక్రవర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీపీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సమావేశానికి జనరల్ అబ్జర్వర్ వీరారెడ్డి హాజరయ్యారు.
ఏకగ్రీవంగా ఎన్నిక..
నిర్మల్‌లో మొత్తం 42వార్డుల్లో కాంగ్రెస్ నుంచి 24మంది, బీజేపీ నుంచి 13మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్‌లుగా గెలిచారు. హైదరాబాద్ క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్‌లు బస్సులో నేరుగా మున్సిపాలిటీ వద్దకు చేరుకున్నారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు కాషాయ తలపాగాలు, కండువాలతో అందరూ కలిసి రావడం ఆకర్షించింది. నూతనంగా ఎన్నికై న అన్నిపార్టీల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఒకటో వార్డు కౌన్సిలర్ కత్తి నరేందర్ చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య పేరును ప్రతిపాదించగా, 22వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఇమ్రానుల్లా బలపర్చారు. వైస్ చైర్మన్‌గా అప్పాల గణేశ్‌చక్రవర్తిని 39 వార్డు కౌన్సిలర్ తౌహిదుద్దీన్ ప్రతిపాదించగా, 28వ వార్డు కౌన్సిలర్ గోపు గోపీనాథ్ బలపర్చారు. ప్రత్యేక అధికారి ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించి సమావేశాన్ని ముగించారు. నూతన చైర్‌పర్సన్ తన చాంబర్‌లో తొలిరోజే బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈఈ. హరిభువన్, అర్బన్ తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు.


