..అనే నేను | - | Sakshi
Sakshi News home page

..అనే నేను

Feb 16 2026 7:20 AM | Updated on Feb 16 2026 7:20 AM

..అనే నేను

..అనే నేను

● నేడే బల్దియా పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

నిర్మల్‌ ఖిల్లా: ‘‘.... అను నేను... పురపాలక సంఘంలో... వార్డు కౌన్సిలర్‌గా కర్తవ్య దీక్షతో, అంతఃకరణ శుద్ధితో నా దృష్టికి వచ్చిన వార్డు సమస్యల పరిష్కారం దిశగా, కాలనీ సంక్షేమం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను...’’ మున్సిపల్‌ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లు ఈ ప్రమాణ వాక్యాలతో సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐదేళ్లపాటు ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతినిధులుగా పనిచేయాల్సిన కీలక దశ ఇక్కడినుంచే ప్రారంభమవుతోంది. సుధీర్ఘకాలం ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ప్రజాప్రతినిధుల పాలన తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభివృద్ధిపై ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.

ప్రధాన బాధ్యతలు

వార్డులో మౌలిక సదుపాయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారం, పారిశుధ్య పర్యవేక్షణ, జంతు బెడద నివారణ, ఆక్రమణల సమాచారం, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల తక్షణ చర్యలు చేపట్టాలి. ఇవి పట్టణ సంక్షేమానికి కీలకం.

సంక్షేమ కార్యక్రమాలు..

కాలనీల్లో తక్షణ సమస్యల గుర్తింపు కోసం వార్డులు సందర్శించాలి. మౌలిక సదుపాయాల మెరుగుదలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. పారదర్శకత కోసం ప్రజలతో సమావేశాలు నిర్వహించాలి. యువత, మహిళా సంఘాలు, వృద్ధుల కమిటీలతో సమన్వయం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ చర్యలు చేపట్టాలి. పట్టణాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలి.

చైర్మన్‌/పర్సన్‌ విధులు

పురపాలక సంఘ చైర్మన్‌/పర్సన్‌కు పాలనలో కీలక బాధ్యతలు ఉంటాయి. కౌన్సిల్‌ సమావేశాలకు అధ్యక్షత వహించడం, తీర్మానాల అమలుపై పర్యవేక్షణ, బడ్జెట్‌ నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేయడం ఆయన ప్రధాన విధులు. ప్రతీ వార్డుకు సమాన ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి జరిగేలా చూడాల్సి ఉంటుంది.

కౌన్సిలర్ల అధికారాలు

వార్డు సమస్యలపై చట్టబద్ధ స్పందన హ క్కు, కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చలు, అభివృద్ధి ప్రతిపాదనలు, బడ్జెట్‌ అభిప్రాయాలు, తీర్మానాలకు ఓటు వంటి అధికారా లు వారికి లభిస్తాయి. ఇవి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా వాడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement