నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Feb 14 2026 9:48 AM | Updated on Feb 14 2026 9:48 AM

నిర్మ

నిర్మల్‌

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

భైంసా, ఖానాపూర్‌లో హంగ్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లా ఓటర్ల విలక్షణ తీర్పు భైంసా, ఖానాపూర్‌లో పొత్తు పెట్టుకోవాల్సిందే..!

దేశసేవలో యువత
గ్రామీణ ప్రాంత యువకులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. చదుకుంటూనే అటుగా అడుగులు వేయడం ప్రారంభించారు. సైనికులుగా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు.

సత్తా చాటిన మహిళలు

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలు సత్తాచాటారు. రిజర్వేషన్‌ వచ్చిన చోట.. కాకుండా జనరల్‌ స్థానాల్లో సైతం బరిలోకి దిగి విజయం అందుకున్నారు. ఎన్నికల్లో మహిళలపాత్ర పెరగడం, విజయం సాధించడం స్పష్టంగా కనిపించింది. 5వ వార్డు నుంచి గుంజల లక్ష్మి(కాంగ్రెస్‌), 7వ వార్డు సలేహా తబుసం(కాంగ్రెస్‌), 10వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మి జనరల్‌ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. 11వ వార్డులో హేమలత(బీజేపీ), 12వ వార్డు భిక్కనూరి సుమలత(కాంగ్రెస్‌), 13వ వార్డు ధర్మాజీగారి రమ్య(బీజేపీ), 17వ వార్డు నుంచి అప్సారి బేగం(కాంగ్రెస్‌), 19వ వార్డు నుంచి అయిండ్ల విజయలక్ష్మి(బీజేపీ), 24వ వార్డు ఒడిసెల లక్ష్మి(బీజేపీ), 26వ వార్డు ఆకుల విజయలక్ష్మి (కాంగ్రెస్‌), 27వ వార్డు అయేషా కౌసర్‌(కాంగ్రెస్‌), 29వ వార్డు నుంచి నజియా, 35వ వార్డు నుంచి పర్వీన్‌(కాంగ్రెస్‌), 36వ వార్డులో అప్పాల కావ్య(కాంగ్రెస్‌), 38వ వార్డులో నాందేడపు అన్నపూర్ణ(కాంగ్రెస్‌), 40వ వార్డులో అడప విజయలక్ష్మి(కాంగ్రెస్‌), 41వ వార్డు ఫాతిమా(ఎంఐఎం) మహిళా రిజర్వేషన్‌ స్థానాల్లో గెలిచారు.

నిర్మల్‌: పురపోరులో నిర్మల్‌ జిల్లా ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కౌంటింగ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చారిత్రక నిర్మల్‌ గడ్డపై అధికార కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. పార్టీ సీనియర్‌ నేతల సమష్టి ప్రచారం ఫలించింది. పొత్తులతో పని లేకుండానే హస్తం సొంతంగా పుర పీఠం దక్కించుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన భైంసా బల్దియాలో ఓటర్లు ఈసారి ఎవరికీ ఫుల్‌ మెజారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఎంఐఎం చైర్మన్‌ పీఠానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయింది. రెండోసారి ఎన్నికలు ఎదుర్కొన్న ఖానాపూర్‌ పట్టణం ఓటర్లు కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఈ రెండు మున్సిపాలిటీలలో హంగ్‌ రావడంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కౌన్సిలర్లను క్యాంపులకు తరలించాయి. ప్రధాన పార్టీలు మినహా మరో పార్టీ జిల్లాలో ఒక్క వార్డునూ గెలువలేకపోయాయి. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలో కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దూసుకొచ్చిన

కమలందండు..

నిర్మల్‌ మున్సిపాలిటీలో ప్రధాన ప్రత్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ గతానికి భిన్నంగా దూసుకువచ్చింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలుచుకున్న కమలదళం, ఈసారి ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఒక దశలో తామే చైర్‌పర్సన్‌ స్థానం దక్కించుకుంటామని బీజేఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఆ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ 22కు చాలా దూరంలోనే ఆగిపోయింది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పంచాయతీ ఇలా వరుస ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఊహించిన స్థాయిలో సీట్లు గెలవడంపై పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కానీ చాలామంది కార్యకర్తలు ఈసారి ఎలాగైనా నిర్మల్‌ బల్దియాపై కాషాయజెండా ఎగురవేయాలని ఆశించారు. ఆ స్థాయిలో స్థానాలు దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు.

‘కారు’ మధ్యలోనే పంక్చర్‌..

నిర్మల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకంగా మారుతామని భావించిన బీఆర్‌ఎస్‌ కారు టైరు మధ్యలోనే పంక్చర్‌ అయింది. మొత్తం 36 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2020 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలతో చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ ఈసారి దారుణంగా ఓడిపోవడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము సతీమణి, బీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి యోగిత, ఎన్నికలకు కాస్త ముందు బీజేపీ నుంచి వచ్చిన సీనియర్‌నేత అయ్యన్నగారి రాజేందర్‌ దంపతులు కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన యువనేత శ్రీకాంత్‌యాదవ్‌, మైనార్టీ నాయకుడు షేక్‌సల్మాన్‌ మాత్రమే గెలిచారు.

పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌..

పదేళ్ల తర్వాత నిర్మల్‌ బల్దియాలో మళ్లీ కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. మొత్తం 42 వార్డులకు గాను 24 స్థానాలను హస్తగతం చేసుకుంది. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 22 కాగా, రెండు స్థానాలు అదనంగానే కాంగ్రెస్‌ పార్టీకి వచ్చాయి. ఒక దశలో మ్యాజిక్‌ ఫిగర్‌కు కాస్త దూరంలోనే కాంగ్రెస్‌ నిలిచిపోతుందనే ప్రచారం జరిగింది. పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్నట్లు భావించారు. కానీ చివరకు మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. పార్టీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అప్పాల కావ్య గణేశ్‌ చక్రవర్తి అంటూ ముందుగానే ప్రచారం చేయడం, నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌ అర్జుమంద్‌అలీ పార్టీ గెలుపుకోసం ప్రచారం చేయడం కలిసి వచ్చింది. వరుసగా గెలుస్తూ వచ్చిన కొంతమంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు కొత్తగా పార్టీ నుంచి చాలా మంది కౌన్సిల్‌లోకి అడుగుపెట్టనున్నారు.

రెండోసారి ఎన్నికలు జరిగిన ఖానాపూర్‌ మున్సిపాలిటీ ఈసారి ఎవరికీ మెజార్టీ ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం 12 వార్డులకుగానూ బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెరో నాలుగు వార్డులు దక్కాయి. కాంగ్రెస్‌ మూడు చోట్ల గెలువగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 7 స్థానాలను ఏ పార్టీ చేరుకోలేదు. రెండు పార్టీలు కలిస్తే తప్ప.. ఇక్కడ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్‌ ముగ్గురూ సీరియస్‌గా పీఠంపై గురిపెట్టారు.

సొంత ఏరియాల్లో ఓటమి..

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌కు చెందిన ప్రముఖులు సొంత ఏరియాల్లో తమ వారిని గెలిపించుకోలేకపోయా రు. నిర్మల్‌ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి నివాసముండే గాజులపేట్‌ ప్రాంతంలో 35వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పర్వీన్‌ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి ఓటమి ఎదురైంది. అలాగే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసముండే ఏఎన్‌.రెడ్డి కాలనీ 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి వినీషా లక్ష్మి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు సొంత ఏరియా 33వ వార్డు భాగ్యనగర్‌ కాలనీలో బీజేపీ అభ్యర్థి ఖమ్మం సురేందర్‌ విజ యం సాధించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైంది. అయితే మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది.

పార్టీలవారీగా గెలిచిన వార్డుల సంఖ్య..

మున్సిపాలిటీ మొత్తం వార్డులు కాంగ్రెస్‌ బీజేపీ బీఆర్‌ఎస్‌ ఎంఐఎం ఇతరులు

నిర్మల్‌ 42 24 13 02 03 00

భైంసా 26 01 06 00 12 07

ఖానాపూర్‌ 12 03 04 04 00 01

మొత్తం 80 28 23 06 15 08

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement