ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్‌టౌన్: మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందొద్దని, పోలీస్‌స్టేషన్‌లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు.https://www.ceir.gov. in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోగొట్టుకున్న రూ.9.96 లక్షల విలువైన 83 ఫోన్లను జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బాధితులకు మంగళవారం అందజేశారు. మార్కెట్‌లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి రిజిస్టర్(సీఈఐఆర్) అప్లికేషన్ పోయిన ఫోన్‌ను వెతికి పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,910 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు.


