రోస్టర్ పాయింట్లతో మాలలకు నష్టం
నిర్మల్‌టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లు, రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర నష్టం జరిగిందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌లో మాల సంక్షేమ సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించాలన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ విధానంలోని లోపాలపై చర్చించాలని కోరుతూ.. మాల సామాజికవర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలపై గళమెత్తిన ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు కుంటోళ్ల స్వామి, ఎలమల రాజేశ్వర్, పురుషోత్తం, లక్ష్మణ్, దొంగరి లింగం, ఏలమల ముత్తన్న, గంగాధర్, ప్రభాకర్, బత్తుల చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.


