కుష్ఠు.. నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు.. నియంత్రణ

Jan 6 2026 1:58 PM | Updated on Jan 6 2026 1:58 PM

కుష్ఠ

కుష్ఠు.. నియంత్రణ

మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026 ● బోర్డు ఏర్పాటు చేయించిన తహసీల్దార్‌

న్యూస్‌రీల్‌

ఇంటింటి సర్వేలో 444 మంది అనుమానితుల గుర్తింపు పూర్తిస్థాయి పరీక్షల అనంతరం తేలనున్న కేసులు జిల్లాలో ఇప్పటికే 55 మంది వ్యాధిగ్రస్తులు

నిర్మల్‌

7

భూకబ్జాను అడ్డుకోవాలి

సారంగపూర్‌: మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కాలనీలో 142 నుంచి 147వరకు గల సర్వే నంబర్లలో ప్రభుత్వం పంపిణీ చేసిన నివేశఽ స్థలాలను కొంతమంది కబ్జా చేస్తున్నారని వా టిని పరిరక్షించాలని తహసీల్దార్‌ సంధ్యారాణికి కాలనీవాసులు సోమవారం వినతిపత్రం అందజేశారు. అయితే ఇదివరకే భూమిని పరిశీలించామని సదరు భూమిపై ఎవరికీ హక్కులు లేవని ఆభూమి ప్రభుత్వానిదేనని గుర్తించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. సదరు భూమిని కబ్జా చేయకుండా తగిన చర్యలు చేపడుతామని తెలుపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చెర్యలు తీసుకుంటామని బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం ఇదివరకు గుడిసెలు వేసుకుని కబ్జాకు యత్నించిన వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ రవీందర్‌, ఎంఆర్‌ఐ నర్సయ్య, జీపీవోలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాలొన్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో కుష్ఠు విస్తరిస్తోంది. గతనెల 18 నుంచి 31 వనకు నిర్వహించిన సర్వేలో 444 మంది అనుమానితులను గుర్తించారు. వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌(ఎల్సీడీసీ) సర్వేను నిర్వహించింది. ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి శరీరంపై ఉన్న నల్ల, తెల్ల, గోధుమరంగు మచ్చలు, స్పర్శలేని మచ్చలను పరిశీలించారు. 444 మందికి లెప్రసీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ పూర్తిస్థాయిలోపరీక్షలను నిర్వహించి ఎంతమందికి వ్యాధి ఉందో తేల్చనున్నారు. అయితే ఐదేళ్లుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

బాధితులకు చికిత్స ఇలా..

జిల్లాలో ఉన్న కుష్ఠు వ్యాధి బాధితులకు బహుళ ఔషధ పద్దతిన (మల్టీ డ్రగ్‌ థెరఫీ–ఎండీటీ) చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 55 మంది వరకు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బాధితులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న కుష్ఠు వ్యాధి విభాగంలో ఎండీటీ పద్ధతిన చికిత్స అందిస్తున్నారు. వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుంచి ఎల్సీడీసీ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలను ఉన్నవారిని గుర్తిస్తుంది. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మల్టీడ్రగ్‌ థెరఫీ చికిత్స చేయిస్తోంది. సర్వేతో జిల్లాలో కుష్ణు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రానున్న రోజుల్లో జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ముందుకు సాగుతోంది.

కుష్ఠు లక్షణాలు..

కుష్ఠువ్యాధి అనేది మైక్రోబ్యాక్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియాతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా ఏ వయసు వారికై నా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నరాలు, చర్మం, ముక్కు ద్వారా ఎగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమరంగు(పాలిపోయిన, స్పర్శలేని మచ్చలు) ఉంటే కుష్టువ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.

ఎల్సీడీసీ సర్వే వివరాలు

సర్వే జరిగిన తేదీలు: 2025, మార్చి17

నుంచి 30 వరకు

సర్వే చేసిన ఇళ్లు 1,82,343

పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య 7,93,731

అనుమానితులు 513

పాజిటివ్‌ తేలినవి 8

సర్వే జరిగిన తేదీలు: 2025,

డిసెంబర్‌ 18 నుంచి 31 వరకు

సర్వే చేసిన ఇళ్లు 20,782

పరీక్షలు నిర్వహించినవారి సంఖ్య 77,648

అనుమానితులు 444

పాజిటివ్‌గా తేలినవి 8

ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్‌ కేసులు 55

క్రమం తప్పకుండా మందులు..

శరీరంపై ఎర్రని, తెల్లని, స్పర్శ లేని గోధుమరంగు మచ్చలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బందికి చూపించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే జిల్లా కేంద్రంలోని లెప్రసీ కేంద్రంలో ఉచిత చికిత్స చేయించుకోవాలి. క్రమంతప్పకుండా మందులు వాడాలి.

– డాక్టర్‌ రాజేందర్‌, డీఎంహెచ్‌వో

కుష్ఠు.. నియంత్రణ 1
1/3

కుష్ఠు.. నియంత్రణ

కుష్ఠు.. నియంత్రణ 2
2/3

కుష్ఠు.. నియంత్రణ

కుష్ఠు.. నియంత్రణ 3
3/3

కుష్ఠు.. నియంత్రణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement