ఖానాపూర్‌కు డిగ్రీ కళాశాల కావాలి
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిధిలోని విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఏటా 2 వేల మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఖానాపూర్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని విన్నవించారు. ఆదిలాబాద్ బీఈడీ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలన్నారు. సీఆర్టీలకు, దివ్యాంగ టీచర్లకు పేస్కేల్ అమలు చేయాలని విన్నవించారు.
ఖానాపూర్‌కు డిగ్రీ కళాశాల కావాలి


