తుది జాబితా
అభ్యంతరాలు
పరిష్కరించాకే
భైంసాటౌన్/నిర్మల్‌టౌన్/ ఖానాపూర్:
ఓటరు ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలపాలని భైంసా మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్ తెలిపారు. నిర్మల్, భైంసా మున్సిపల్ కార్యాలయాల్లో, ఖానాపూర్ ఎంపీడీవో కార్యాల యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించా రు. 2019 వార్డుల విభజన గెజిట్ ప్రకారమే ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశామన్నా రు. అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలోని గ్రీవెన్స్ విభాగంలో రాతపూర్వకంగా అందించాలన్నారు. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ చేపట్టామ ని, క్షేత్రస్థాయిలో విచారణ సైతం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను గెజిట్‌తోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 10న ఓటరు తుది జాబితా ప్రకటిస్తామన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఒక వార్డు ఓట్లు మరో వార్డులో నమోదు చేశారని మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి తెలిపారు. కొన్ని వార్డుల్లో కొందరి పేర్లు రెండు మూడుసార్లు నమోదు చేశారని వెల్లడించారు. అధికారుల అవగాహన లోపంతోనే గందరగోళం నెలకొందని ఆరోపించారు. జాబితా సవరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భైంసా డీఈఈ జాదవ్ సంతోష్, టీపీవో అనురాధ, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, నాయకలు పాల్గొన్నారు.


