ఒక్కోరాయి పేర్చి.. రోడ్డుగా మార్చి..
పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలు అయిన యాపలగూడ, రాంనగర్, వస్పల్లి, దోందారి, చాకిరేవు ప్రజలు మండల కేంద్రానికి చేరాలంటే వాగులు, ఒర్రెలు దాటాలి. ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళ్తున్నారు. పంటలు అమ్ముకోవడానికి భారీ వాహనాలు తీసుకెళ్లడం కష్టం. దీనికి గిరిజనులంతా ఏకమై పరిష్కారం కనుగొన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా సొంత ఖర్చుతో రహదారి నిర్మించుకున్నారు. యాపలగూడ సమీపంలోని దోత్తి వాగులో ట్రాక్టర్లతో రాళ్లు పోశారు. తర్వాత ఒక్కోరాయి పేర్చి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసుకున్నారు. దోత్తి వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. – పెంబి


