ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి
నిర్మల్‌టౌన్: ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఎన్నికై న ముదిరాజ్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ముది రాజ్‌లు శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముదిరాజ్‌లను బీసీ–ఏ గ్రూపులోకి మార్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజ్‌లు అధిక స్థానాల్లో గెలవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సమన్వయ కమిటీ నాయకులు చొప్పరి శంకర్, మద్దెల సంతోష్, గుండ్లపల్లి శ్రీను, జగన్, బొజ్జ నారాయణ, శివయ్య, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


